- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్ చేసిన అతిపెద్ద తప్పు ఇదే.. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌పై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఇష్టానుసారంగా పరిపాలన సాగించాడని మండిపడ్డారు. ఏపీకి మూడు రాజధానుల నిర్ణయం జగన్ చేసిన అతిపెద్ద తప్పుగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అనేదే లేదని.. ఐదేళ్లలో కనీసం రోడ్లు కూడా వేయలేదని ఫైర్ అయ్యారు. జైళ్లో ఉన్న సమయంలో ఆదుకున్న తల్లి, చెల్లిని అవసరం తీరాక జగన్ గెంటేశాడని ఆరోపించారు. భార్య కోసం సొంత బంధాలను కూడా తెంచేశాడన్నారు. ఐదేళ్లలో ఏదైనా కేసులో జగన్ జైలుకు వెళ్తే ఆయన భార్య భారతి సీఎం అయ్యేలా ప్లాన్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటి వరకు సన్ స్ట్రోక్ చూశాం.. కానీ జగన్‌కు వైఫ్ స్ట్రోక్ ఉందని ఎద్దేవా చేశారు. సీఎం హోదాలో జగన్ పూర్తి మద్యం వ్యాపారిలా మారాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన నాసిరకం మద్యం వల్ల రాష్ట్రంలో 3 వేల మంది చనిపోయారని ఆరోపించారు. ఐదేళ్ల పాటు యువతకు ఉద్యోగం, ఉపాధి లేకుండా చేశాడని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం.. ఎన్డీఏ కూటమి విజయం సాధించడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ బైబై వైసీపీ అంటున్నాయని ఎద్దేవా చేశారు.