- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విజయసాయిరెడ్డి 'కోటరీ' వ్యాఖ్యలపై మాజీమంత్రి అంబటి ఫైర్

దిశ, వెబ్ డెస్క్: మాజీ వైసీసీ నేత విజయసాయి రెడ్డి జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) చేసిన వ్యాఖ్యలకు మాజీమంత్రి అంబటి రాంబాబు (Former Minister Ambati Rambabu) ఫైర్ అయ్యారు. పార్టీ నుంచి వెళ్లిపోయాక బురద జల్లడం కామన్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. జైలులో రిమాండ్ లో ఉన్న పోసాని కృష్ణ మురళితో (Posani Krishna Murali)ములాఖత్ అయిన అంబటి.. అక్కడే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. విజయ సాయి రెడ్డి (Vijayasai Reddy) వ్యాఖ్యలకు స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోకేశ్ (Lokesh Nara) రెడ్ బుక్ (Red Book) రాజ్యాంగంలో భాగంగానే కక్షపూరితంగా అరెస్టులు చేస్తున్నారని, నేను మాట్లాడుతున్నా.. నాపై కేసులు పెడతారా..? అని ప్రశ్నించారు. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ (YSRCP Party)లో కోటరీ ఉందని అంటే అది విజయసాయి రెడ్డే అని, నాకు తెలిసి కోటరీ ఏమీ లేదని అన్నారు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఆయనే ప్రధాన సలహాదారుడు.. ఆయనే కోటరీ అని, ఆయనే పార్టీ నుంచి వెళ్లిపోయారు కాబట్టి కోటరీ కూడా వెళ్లిపోయినట్టేనని అన్నారు. విజయ సాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయాడు కాబట్టి పార్టీపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాడని, ఇది ఆయనకు మంచిది కాదని ఈ సందర్భంగా చెబుతున్నానని అన్నారు.
వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత విజయసాయి రెడ్డి పార్టీలో చేరి నాయకుడిగా ఎదిగాడని అన్నారు. పార్టీ పెట్టక ముందు ఆయన కేవలం ఆడిటర్ (Auditor) మాత్రమేనని, పార్టీలోకి వచ్చాకే పదవులు పొందారని, జగన్ మోహన్ రెడ్డికి సలహాదారుడుగా ఉన్నాడని అంబటి వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జగన్ కోటరీ వల్లే ఆయన ఈ స్థితికి వచ్చారని, కోటరీని దూరం పెడితే బాగుపడతారని సలహాలు ఇచ్చారు. అలాగే తాను కోటరీ వల్లే వైసీపీని వీడాల్సి వచ్చిందని, వైసీపీ నుంచి బయటికి వచ్చినా జగన్ బాగు కోరుకుంటున్నానని అన్నారు.
Read Also..