Ap Assembly Sessions: మరోసారి తెరపైకి జగన్ అంశం..?

by srinivas |   ( Updated:2024-07-21 11:38:21.0  )
Ap Assembly Sessions: మరోసారి తెరపైకి జగన్ అంశం..?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి11 సీట్లు రావడంతో ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని అధికాపక్షం చెబుతోంది. సామాన్య ఎమ్మెల్యేగానే అసెంబ్లీకి రావాలని అంటోంది. మరోవైపు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఇప్పటివరకూ అసెంబ్లీలో స్థిరమైన సీట్లు స్పీకర్ కేటాయించలేదు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండంతో జగన్ తోపాటు ఎమ్మెల్యేల అంశం కొత్త చర్చకు దారి తీసింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు బిల్లులను అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు రద్దు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి వస్తారా.. రారా అనే అంశంపైనా చర్చ సాగుతోంది. అటు అసెంబ్లీకి వచ్చే విజిటర్స్ పాస్‌లను సైతం కుదిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల వెంట అనుచరులు భారీగా వస్తుండటంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

Next Story