వైఎస్ఆర్‌ని తిట్టిన వారికే జగన్ పెద్దపీట..వైఎస్ షర్మిల ఫైర్

by Jakkula Mamatha |   ( Updated:2024-04-24 14:45:06.0  )
వైఎస్ఆర్‌ని తిట్టిన వారికే జగన్ పెద్దపీట..వైఎస్ షర్మిల ఫైర్
X

దిశ,వెబ్‌డెస్క్: మంత్రి బొత్స తండ్రితో సమానమని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బొత్స సత్యనారాయణపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో వైఎస్‌ఆర్ తాగుబోతు అని తిట్టారని గుర్తు చేశారు. అలాంటి బొత్స సత్యనారాయణ తనకు తండ్రితో సమానులు అని సీఎం జగన్ అనడం ఆశ్యర్యంగా ఉందని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో తన తండ్రినే తిట్టిపోసిన వ్యక్తి అని ఆమె ఆరోపించారు. బొత్స పలు సందర్భాల్లో వైఎస్ కుటుంబాన్ని దూషించినట్టు చెప్పారు. విజయమ్మను సైతం బొత్స అవమానపరిచారని పేర్కొన్నారు. ఇవన్నీ తెలిసి కూడా సీఎం జగన్ అలాంటి వారికే పెద్దపీట వేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు జగన్‌కు తండ్రితో సమానం అయ్యారని విమర్శించారు. జగన్ క్యాబినెట్లో ఉన్న వారందరూ వైఎస్ఆర్‌ను తిట్టిన వారేనని దుయ్యబట్టారు. నిజంగా ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్లు, గొడ్డలి పోటులకు గురైన వాళ్లు ఏమీ కారని విమర్శించారు.

Read More...

AP Politics:ఆ నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఫీవర్..!

Advertisement

Next Story