నంద్యాల స్కూల్లో ఫుడ్ పాయిజన్.. 100 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత

by srinivas |   ( Updated:2024-08-03 07:15:25.0  )
నంద్యాల స్కూల్లో ఫుడ్ పాయిజన్.. 100 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
X

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల వెంకటేశ్వరపురంలో ఓ ప్రైవేటు స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 100 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా స్కూలు హాస్టల్‌లో విద్యార్థులు రాత్రి భోజనం చేశారు. అయితే కొద్దిసేపటికే విద్యార్థులు వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. కడుపులో ఒక్కసారిగా మంట రావడంతో విద్యార్థులు అల్లాడిపోయారు. విషయం తెలుసుకున్న స్కూలు సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా విద్యార్థులకు హాస్టల్‌లోనే చికిత్స అందిస్తున్నారు. అయితే విషయం బయటకు తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూలు వద్దకు భారీగా చేరుకున్నారు. తమ పిల్లలు ఎందుకు అస్వస్థతకు గురయ్యారని ప్రశ్నించారు. తమ పిల్లల ఆరోగ్య పరిస్థితి తెలపాలంటూ నిలదీశారు. స్కూలు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story