ఏబీవీకి గుడ్ న్యూస్.. కీలక పదవి ఇచ్చిన ప్రభుత్వం

by srinivas |
ఏబీవీకి గుడ్ న్యూస్.. కీలక పదవి ఇచ్చిన ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు(Former IPS AB Venkateswara Rao)కు గుడ్ న్యూస్ లభించింది. ఆయనకు ఏపీ ప్రభుత్వం(AP Govt) కీలక పదవి అప్పగించింది. ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌(AP Police Housing Corporation Chairman)గా ఆయన్ను నియమించింది. అంతేకాదు ఆ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా ఏబీ వెంకటేశ్వరరావును జగన్ ప్రభుత్వం రెండు సార్లు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే కోర్టు ద్వారా పోరాటం చేసిన ఆయన పదవి విరమణ రోజే తన పోస్టును దక్కించుకున్నారు. ఒక్క రోజు పదవిలో కొనసాగిన తర్వాత పదవి నుంచి విరమణ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఆయన పోరాటాన్ని గుర్తించింది. సస్పెన్షన్ కాలాన్ని ఎత్తి వేసింది. అంతేకాదు ఆ కాలానికి సంబంధించిన వేతనం, అలెవెన్సులను చెల్లించేందుకు అంగీకారం తెలిపింది. సస్పెన్స్ పడకపోతే ఎంత చెల్లించాలో అంత మొత్తం చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు ఏబీవీపై ఉన్న అభియోగాలను వెనక్కి తీసుకుంది.

కాగా జగన్ సర్కార్ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావును వివిధ కారణాలు చూపి రెండు సార్లు సస్పెండ్ చేశారు. తొలిసారి 2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. రెండోసారి జూన్ 2022 జూన్ 8 నుంచి 2024 మే 30 వరకూ సస్పెండ్ చేసింది. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించి తన పదవిని దక్కించుకున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టు ఇచ్చి ఏబీవీని గౌరవించింది.


Next Story

Most Viewed