- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎవరో పుల్లయ్యకు టికెట్ ఇస్తే చేతులు ముడుచుకొని కూర్చోను.. మాజీ ఎమ్మెల్యే సీరియస్

దిశ, వెబ్‌డెస్క్: పెనమలూరు టికెట్‌పై మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వసంత కృష్ణ ప్రసాద్ సహా ఎవరు వచ్చినా తాము ఒప్పుకోమని అన్నారు. ఎవరో ఎల్లయ్య, పుల్లయ్య వచ్చి ఇక్కడ పోటీ చేస్తామంటే ఎలా ఒప్పుకుంటామని తెలిపారు. తాను చేతులు ముడుచుకొని కూర్చునే టైప్ కాదని చెప్పారు. టికెట్ విషయంలో ధీమాగానే ఉన్నానని అన్నారు. సర్వేలు కూడా అన్నీ నాకే అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. టికెట్ విషయంలో కన్‌ఫ్యూజన్ ఉండాల్సిన అవసరం లేదని అధిష్టానానికి హితవు పలికారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని రానున్న ఎన్నికల్లో తనను ఆదరించాలని కోరారు.
అధికారంలో ఉన్న ఐదేళ్లు.. ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లు నియోజకవర్గ ప్రజలకు అందు బాటులో ఉంటూ వచ్చానన్నారు. వలస వచ్చిన ప్రతిపక్ష పార్టీ నాయకులను నమ్మి మోసపోవద్దన్నారు. తనను గెలిపించిన ఏడాది లోపే ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లుగా అభివృద్ధిలో వెనుకబడిన రాష్ర్టాన్ని బాగుచేసుకోవడానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీని బలపరచాలని పిలుపునిచ్చారు. అవినీతి, నిరుద్యోగం, రైతుల, కార్మికుల ఆత్మహత్యలు జగన్‌రెడ్డి హయాంలో ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.