- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
సునామీలా జరిగిపోయాయి.. ఎన్నికల ఓటమిపై రోజా కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఎన్నికలు ఒక సునామీలాగా జరిగిపోయాయని మాజీ మంత్రి రోజా అన్నారు. ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదని, నాయకులు ఏ తప్పు చేయలేదని, కానీ వైసీపీ ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చిందన్నారు. నగరిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఏ రోజుకైనా అసలు విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడే కాదని, ప్రతిపక్షంలో ఉన్నా కార్యకర్తలకు తాము అండగా ఉంటామని రోజా హామీ ఇచ్చారు.
కాగా ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరమైన ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో తన ప్రొఫైల్‌కు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును తొలగించారు. వైసీపీ అధినేత జగన్‌ను అన్ ఫాలో చేశారు. దీంతో వైసీపీకి ఆమె గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం జరిగింది. అయితే వైసీపీ అధినేత జగన్, భారతి పెళ్లి రోజు సందర్భంగా ఆమె విషెస్ చెప్పి తాను ఆ పార్టీ వెంటే ఉన్నాననే సంకేతాన్ని ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో ఆమె ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రతిపక్ష నాయకులపై ఒంటికాలిపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసిన రోజా.. టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్‌పై ఘోరంగా ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆమె స్తబ్దుగా ఉన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో కార్యకర్తలకు భరోసానిస్తూ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై రోజా కీలక వ్యాఖ్యలు చేశారు.