Election Commission: ‘ఓటేసేందుకు ఆధార్ తప్పనిసరి’.. వదంతులపై ఈసీ కీలక వ్యాఖ్యలు.. అధికారులకు ఆదేశాలు జారీ

by Shiva |   ( Updated:2024-02-27 06:56:26.0  )
Election Commission: ‘ఓటేసేందుకు ఆధార్ తప్పనిసరి’.. వదంతులపై ఈసీ కీలక వ్యాఖ్యలు.. అధికారులకు ఆదేశాలు జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతుండగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు తన ఓటు హక్కును వినయోగించుకునేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి అని వస్తున్న వార్తలను కొట్టి పడేసింది. ఓటు వేసేందుకు ఆధార్ అవసరం లేదని, ప్రభుత్వం తరపున జారీ చేసిన ఏ గుర్తిపు కార్డైనా చూపించి ఓటు వేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఎవరికైనా రెండు చోట్ల ఓటు ఉంటే స్వచ్ఛందగా ఒక దానిని రద్దు చేసుకోవాలని విజ్క్షప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed