- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాలంటీర్లకు మరో షాక్ ఇచ్చిన ఈసీ.. ఆ కార్యక్రమంలో పాల్గొంటే కఠిన చర్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఈసీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పంపిణీ లో కీలకమైన వాలంటీర్లపై ఈసీ ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఓటర్లతో ప్రత్యక్ష సంబంధాలున్న వాలంటీర్లు సంక్షేమ పథకాల పంపిణీ సమయంలో ప్రజలను అధికార పార్టీ వైపు ప్రభావితం చేసే విధంగా ప్రచారం చేస్తున్నారనే పిర్యాదలు వచ్చాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 3న ఇవ్వాల్సిన పించన్లను వాలంటీర్లు ఇవ్వొద్దని, పంచాయతీ కార్యాలయంలో పించన్లను పంపిణీ చేయాలని ఈసీ తెలిపింది.
ఈ క్రమంలోనే వాలంటీర్ల వద్ద ఉన్న ప్రభుత్వం ట్యాబ్‌లు, డేటా, ఇతర డాక్యుమెంట్లను గ్రామ సచివాలయంలో సబ్ మీట్ చేయాలని ఈ రోజు తెల్లవారుజామున ఉత్తర్వులు జారీ చేసింది. మరి కొద్ది సేపటికే వాలంటీర్లకు ఈసీ షాక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రేషన్ పంపిణీలోను వాలంటీర్లు పాల్గొనవద్దని ఆదేశించింది. వారి స్థానంలో వీఆర్వోలు, మ్యాపింగ్ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే ఎండీయూ ఆపరేటర్లు కూడా వాలంటీర్లను రేషన్ పంపిణీ కార్యక్రమానికి పిలవకూడదని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లను ఎవరైన అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ పేర్కొంది.
Read More..
AP : జగన్ అక్రమాస్తుల కేసులో జాప్యం.. సుప్రీం కోర్టు సీరియస్