- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: సముద్రం ద్వారా విదేశాలకు రేషన్ బియ్యం.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ యాంకరేజ్ పోర్టు(Kakinada Anchorage Port) వద్ద సముద్రంలో జరుగుతున్న రేషన్ బియ్యం(Ration Rice) స్మగ్లింగ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తానే సముద్రంలో వెళ్లి తనిఖీలు నిర్వహించారు. అయితే ఆ సమయంలో పోర్టు అధికారులు సహకరించకపోవడంతో పవన్ మండిపడ్డారు. అటు స్థానిక ప్రతిప్రతినిధులపైనా పవన్ మండిపడ్డారు. ప్రభుత్వ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోవడంపై చురకలంటించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ రేషన్ బియ్యం స్మగ్లింగ్‌కు మూలాలు చాలా బలంగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయికి అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి తీరప్రాంతం ఉండటం ఎంత బలమో, అంతే బలహీనత కూడా అని వ్యాఖ్యానించారు. కీలకమైన సంస్థలు రాష్ట్రంలో ఉన్నాయని, ఎవరైనా వంద కిలోల ఆర్డీఎస్ తీసుకొస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కసబ్ లాంటి వాళ్లు బోట్‌లో వచ్చి కాల్చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపును ఎవరూ దీన్ని పట్టించుకోవడంలేదని, ఎస్పీకి చెబితే ఇప్పటి వరకూ తనకు రిపోర్టు లేదని మండిపడ్డారు. గురువారం రాత్రి షిప్‌లో పీడీఎస్ బియ్యం పట్టుకున్నారని, అందువల్లే తాను స్వయంగా పరిశీలించేందుకు వచ్చానని పవన్ కల్యాణ్ తెలిపారు. పీడీఎస్ బియ్యాన్ని ఇక్కడి నుంచి అక్రమంగా తరలించి ఆఫ్రికా దేశాల్లో 70 రూపాయలకు అమ్ముతున్నారన్నారు. పేదలకు ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని కొందరు అక్రమార్కులు విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. తాను సముద్రం వద్దకు వస్తానంటే అధికారులు రావద్దన్నారని పవన్ పేర్కొన్నారు.
స్మగ్లింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదని, లీగల్‌గా ఎగుమతి చేసుకుకోవడానికి మాత్రమే అనుమతి ఉందని పవన్ తెలిపారు. డిప్యూటీ సీఎంగా ఉన్న తనకే పోర్ట్ అధికారులు సహకరించలేదని ఆయన మండిపడ్డారు. స్టెల్లా షిప్‌పైకి వెళ్లేందుకు పోర్ట్ అధికారులు అసలు ఒప్పుకోలేదని, అక్కడక్కడే తనను తిప్పారని చెప్పారు. ఉచిత బియ్యాన్ని విదేశాలకు తరలిపోవడంపై పోర్టు అధికారులకు నోటీసులు ఇవ్వండని, షిప్‌ను సీజ్ చేయండని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 25 కిలోల హెరాయిన్ విశాఖలో దొరికిందని చెప్పారు. పథకాల అమలు చేయడానికే తాము కింద మీద పడుతున్నామని, ప్రజాధనంతో బియ్యం కొంటే, దాన్ని తరలిస్తూ వేల కోట్లు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపు విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తామని పవన్ పేర్కొన్నారు. కొన్ని కంపెనీల యాజమాన్యాలు రేషన్ బియ్యం తరలింపు వ్యవహారంలో కింగ్ పిన్స్‌గా ఉన్నాయని అటు అధికార యంత్రాగం కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.