Mla Jyothula Chantibabu: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

by srinivas |
Mla Jyothula Chantibabu: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
X

దిశ,జగ్గంపేట: విద్యారంగానికి జగన్మోహన్ రెడ్డి పాలనలో అధిక ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థులకు సఖల సదుపాయాలు సమకూరుస్తున్నారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయంలో పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో జగన్మోహన్ రెడ్డి పాఠశాల విద్య రూపురేఖలు సమూలంగా మార్చి వేశారన్నారు. 'నాడు నేడు' పథకం ప్రవేశపెట్టి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు సమకూర్చడం జరిగిందన్నారు. పాఠశాల స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియం బోధన ప్రవేశపెట్టి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ విద్యారంగాన్ని ప్రథమ స్థాయిలో నిలిపారని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పేర్కొన్నారు.

విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం వండి అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయడంతో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విధంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం విశేషమని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి చదువుకున్న పాఠశాలకు సదుపాయాలు కల్పించిన పాలకులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి ఎంపీపీ తోట రవి ,జగ్గంపేట జడ్పిటిసి బిందు మాధవి రఘురాం, ఎంపీడీవో హరికృష్ణ, పాఠశాల ఉపాధ్యాయులు, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed