- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కూటీలో నల్లతాచు.. నిర్ఘాంతపోయిన వాహనదారుడు
దిశ, వెబ్ డెస్క్: పాము దూరంగా కనిపిస్తేనే హడలిపోతారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతారు. అలాంటి దగ్గరికి వస్తే గుండెలు పగిలిపోతాయి. అలాంటిది మనం ఎటు జర్ని చేస్తే అటు వస్తే ఇంకేముందే ప్రాణాలు పోయినంత పని అవుతుంది. అటువంటి ఘటన కోనసీమ జిల్లాలో జరిగింది. వేమవరం ప్రాంతానికి చెందిన యువకుడు పెట్రోల్ కొట్టించుకునేందుకు స్కూటీతో వెళ్లారు. పెట్రోల్ బంక్ వద్ద ఆగి స్కూటీ డిక్కీ తీశారు. అయితే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఢిక్కీ తీసిన వెంటనే ఒక నల్లతాచు పాము పిల్ల బుసలు కొడుతూ ఎగిరి కింద పడింది.
దీంతో యువకుడు నిర్ఘాంతపోయారు. కాళ్లు చేతులు వణికిపోయాయి. కాస్తలో తప్పించుకున్నందుకు హమ్మయ్య అనుకున్నారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందజేశారు. స్నేక్ క్యాచర్ వెంటనే స్పందించి పెట్రోల్ బంకు వద్దకు వెళ్లారు. రెండు అడుగులున్న నల్లతాచును బంధించి పారెస్ట్ ఏరియాలో వదిలివేశారు. పిల్ల పాము కాబట్టి ఏమి కాలేదని, అదే పెద్ద స్నేక్ అయి ఉంటే చాలా ప్రమాదం జరిగేదన్నారు. నల్ల తాచు చాలా డేంజర్ అని తెలిపారు. నల్లతాచును స్నేక్ క్యాచర్ పట్టుకోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.