ఎన్నికల కోడ్ ముగియగానే.. డీఎస్సీ నోటిఫికేషన్

by Anil Sikha |   ( Updated:2025-02-01 14:08:41.0  )
ఎన్నికల కోడ్ ముగియగానే.. డీఎస్సీ నోటిఫికేషన్
X

దిశ, డైనమిక్ బ్యూరో

ప్రభుత్వ బడుల్లో డ్రాప్స్ ఔట్స్ తగ్గించేందుకు ప్రత్యేక వ్యవస్థను తీసుకు వస్తున్నట్లు, మానవ వనరుల ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఎన్టీఆర్ భవన్లో విలేకరులతో చిట్ చాట్ గా మాట్లాడారు. గత ప్రభుత్వం 3000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పెట్టిందన్నారు. మేము వచ్చాక ఎనిమిది కోట్ల ఫీజు రీయింబర్స్ బకాయిలు చెల్లించామన్నారు. జగన్ పెట్టిన ఫీజు బకాయిలపై వైసీపీ ఆందోళనలో చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అదేవిధంగా జగన్ పెట్టిన ధాన్యం, పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల బకాయిలు తీరుస్తున్నమన్నారు. విద్యార్థులు టీచర్లు వివరాలను గత వైసిపి ప్రభుత్వం గందరగోళం చేసింది అన్నారు. విద్యార్థుల సంఖ్య కచ్చితంగా తెలుసుకునేందుకు అపార్ కార్డు విధానం తీసుకువచ్చామన్నారు. టీచర్ల బదిలీలో పారదర్శకత కోసం ట్రాన్స్ఫర్ యా క్ట్ చేస్తున్నామన్నారు. విద్యాశాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం టీచర్ల సమస్యలు వింటున్నారని తెలిపారు. వ్యవస్థలో భాగస్వాములతో చర్చించాకే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వేయగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. మార్చిలో డీఎస్సీ ప్రక్రియ ప్రారంభించే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పోస్టులను భర్తీ చేస్తామని లోకేష్ తెలిపారు. ఉమ్మడి ఏపీ నవ్యాంధ్రలో 80% టీచర్ నియామకం చేసింది తామేనని గుర్తు చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో టీచర్ల అభిప్రాయాలు ఉంటాయని తెలిపారు. విద్యా వ్యవస్థలో అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఎక్కువ మంది పోలీసులు ఉండడంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయానికి వచ్చే వారిని ఇబ్బంది పెట్టవద్దని పోలీసులకు సూచించారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే కార్యకర్తలను ఇబ్బంది పెట్టవద్దు అన్నారు.


Next Story

Most Viewed