- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబుకు బెయిలివ్వొద్దు.. కస్టడీకివ్వండి: పొన్నవోలు సుధాకర్ రెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కాం కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో రెండోరోజు వాదనలు కొనసాగుతున్నాయి. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. స్కిల్ స్కాం కేసులో ముఖ్యమైన పాత్ర చంద్రబాబు నాయుడుదేనని వాదించారు. ఈ స్కిల్ స్కాం కేసులో కర్త, ఖర్మ, క్రియ చంద్రబాబేనని చెప్పుకొచ్చారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అవినీతికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఒక్కొక్క ఆధారాలు బయటపడుతున్నాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు స్వయంగా 13 చోట్ల సంతకాలు పెట్టారని అన్నారు. ఈ స్కాం కేసులో రూ.27 కోట్లు నేరుగా టీడీపీ ఖాతాలోకి జమ అయ్యాయి అని పొన్నవోలు వాదించారు. ఆర్టికల్14 ప్రకారం చట్టం ముందు అంతా సమానమేనని వాదించారు. సీఎం హోదాను అడ్డుపెట్టుకుని ప్రజధానాన్ని దుర్వినియోగం చేస్తే ఎలా? స్కిల్ స్కాం అనేది సాధారణ కేసు కాదు తీవ్రమైన నేరంగా భావించాలని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. ఈ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. మరో 15 రోజులు రిమాండ్ విధించాలని కోరారు. అంతేకాదు ఈ కేసులో చంద్రబాబు ప్రమేయంపై పక్కా ఆధారాలు ఉన్న నేపథ్యంలో కస్టడీకి సైతం ఇవ్వాలని కోరారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు బయటకు రావాలంటే చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోరారు.