- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్ని రోగాలు ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి అవసరమా..? : మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్‌పై మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. చంద్రబాబు కంటి ఆపరేషన్ చేయించుకోవడం కోసం మాత్రమే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని చెప్పుకొచ్చారు. మధ్యంతర బెయిల్ గడువు ముగిసిన తరువాత చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్లాల్సిందేనని చెప్పుకొచ్చారు. విజయవాడలో ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మాత్రమే ఇచ్చిందని..అంతమాత్రాన టీడీపీ నానా హంగామా చేస్తోందని అన్నారు. చంద్రబాబుకు అనారోగ్యాల దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందని చెప్పుకొచ్చారు. ఇన్ని రోగాలు ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి అవసరమా..? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు, ప్రతిపక్ష నేతగా కూడా చంద్రబాబు పనికిరాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నేరం చేయలేదని ఆయన తరఫు న్యాయవాదులు ఎక్కడా చెప్పలేదని చెప్పుకొచ్చారు. కేవలం అనారోగ్యం, భద్రత అంటూ వాదిస్తున్నారన్నారని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని నమ్మించి కాసాని జ్ఞానేశ్వర్‌ను చంద్రబాబు నట్టేట ముంచేశాడన్నారు. కాంగ్రెస్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకుని టీడీపీ జెండా పీకేశారని... బీసీలను చంద్రబాబు మరోసారి మోసం చేశారని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. 2024లో ఏపీలోనూ టీడీపీ జెండా పీకేయడం ఖాయమని అన్నారు. పవన్ టీడీపీతో కలిసినా ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పుకొచ్చారు. లోకేశ్ అసమర్థుడు అని టీడీపీ క్యాడర్ భావిస్తోందని అందుకే పవన్ కల్యాణ్ మద్దతు కోరుతోందని అన్నారు. ఇకపోతే ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరికి చంద్రబాబు అవినీతిలో భాగస్వామ్యం ఉంది కాబట్టే.. చంద్రబాబును కాపాడటానికి ఆమె ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును సీఎం చేయాలనేది పురంధేశ్వరి లక్ష్యం.. ఆమె లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లో నెరవేరదని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ జోస్యం చెప్పారు.
Read More..
చంద్రబాబు మీడియాతో మాట్లాడొద్దు.. రాజకీయం ప్రసంగం చేయకుండా ఆదేశించండి: ఏపీ హైకోర్టులో సీఐడీ పిటిషన్