గుండెల్లో పెట్టుకుని చూసుకునే జగనన్న కావాలా? గడప బయటే నిలబెట్టే చంద్రబాబు కావాలా?: మాజీమంత్రి అనిల్

by Seetharam |
గుండెల్లో పెట్టుకుని చూసుకునే జగనన్న కావాలా? గడప బయటే నిలబెట్టే చంద్రబాబు కావాలా?: మాజీమంత్రి అనిల్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ప్రజా సంకల్పయాత్ర ద్వారా ప్రజల కష్టాలు విని, బాధలు చూశారని....అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు,బలహీనవర్గాలకు ఎంతో గుండెధైర్యాన్నిచ్చారు అని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నా ఎస్సీ,నాఎస్టీ, నాబీసీ, నా మైనార్టీలంటూ వారిని అక్కున చే ర్చుకున్నారు అని కొనియాడారు. అంతేకాదు వారి చెయ్యిపట్టి ముందుకు నడిపిస్తున్నారని చెప్పుకొచ్చారు. కలలో కూడా ఊహించని రీతిలో బడుగు,బలహీనవర్గాల వారికి రాజకీయపదవులిచ్చారు. కార్పొరేషన్లలో ఛైర్మన్ల, డైరెక్టర్ల పదవులిచ్చారు. మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ పదవులిచ్చారు అని కొనియాడారు. రాజకీయంగా వెనుకబడ్డవర్గాల స్థాయిని పెంచిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు. సంక్షేమపథకాల ద్వారా పేదల ఆత్మగౌరవాన్ని పెంచిన సీఎం... జగనన్న. –లబ్దిదారులకు నేరుగా ఇంటిగడప దగ్గరే సంక్షేమ ఫలాలు అందిస్తున్న పాలన జగనన్నది అని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు.

చంద్రబాబును నమ్మెుద్దు

లక్షలాది మంది పేదవారి ఆత్మగౌరవాన్ని పెంచిన ఏకైక నాయకుడు వై.ఎస్‌.జగన్‌ అని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొనియాడారు. ఎల్లోమీడియా రాతలు నీచంగా ఉన్నాయి. పేదపిల్లలకు ట్యాబులిచ్చినా వారి కడుపులు మండిపోతున్నాయి. పేదబిడ్డల ఇంగ్లీషుమీడియం చదువులు కూడా వారికి కంటగింపుగా ఉంది అని మండిపడ్డారు. జగనన్న చేస్తున్న మంచిపనులన్నీ వారికి నచ్చట్లేదు. ప్రజలకు మేలు జరిగితే వారు సహించలేరు అని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొచ్చారు. ఇక ఎల్లోమీడియా నెత్తినెత్తుకున్న చంద్రబాబు గురించి రాష్ట్రప్రజలందరికీ తెలుసునని... కుట్రలు,కుతంత్రాలతోనే ఆయన రాజకీయం చేస్తారు అని మండిపడ్డారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తారన్నారు. గుండెల్లో పెట్టుకుని చూసుకునే జగనన్న కావాలా? గడప బయటే నిలబెట్టే చంద్రబాబు కావాలా?ఆలోచించుకోవాలని సూచించారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాల వారు, మహిళలు అందరూ జగనన్నను గెలిపించుకోవాలి. ఆయన మన వెన్ను తట్టి ..ముందుకు నడిపించారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మన స్థాయిని పెంచారు సీఎం వైఎస్ జగన్ అని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొనియాడారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story