- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీ, తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులు ఎంతో తెలుసా?
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌ను గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌పై మీడియాకు వెల్లడించారు. దేశంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ప్రధాని మోడీ ఆధ్వర్యంలో బడ్జెట్ కేటాయింపులు జరిగాయని ఆయన స్పష్టం చేశారు. 2009-14లో ఉమ్మడి ఏపీకి రూ. 886 కోట్లు మాత్రమే ఇచ్చారని, ఈ బడ్జెట్‌లో ఏపీకి రూ. 9,138 కోట్లు కేటాయించామని, పది శాతం రెట్టింపు అని తెలిపారు. ఏపీలో 98 శాతం రైల్వే ట్రాక్స్‌కి విద్యుదీకరణ పూర్తి అయిందన్నారు.
ఏపీలో 72 రైల్వే స్టేషన్లు అమృత్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఏడాదికి 240 కిలోమీటర్ల ట్రాక్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. విశాఖ రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగామన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంకా భూమి అప్పగించలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు భూమి ఇస్తే.. అప్పుడు పనులు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జోన్ ఏర్పాటు కోసం డీఎపీఆర్ సిద్ధమైందన్నారు.
తెలంగాణకు రూ. 5,071 కోట్లు
తెలంగాణకు ఈ ఏడాది రూ. 5,071 కోట్లు కేటాయించామని వెల్లడించారు. తెలంగాణలో 100% విద్యుదీకరణ పూర్తయిందన్నారు. రాష్ట్రంలో రైల్వేపై పెట్టుబడులు గణనీయంగా పెరిగాయిని, 40 శాతం అమృత్ స్టేషన్లు తెలంగాణలో నిర్మిస్తున్నామని చెప్పారు. ఖాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీకి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారని, ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు.