TDP MLC : టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీ ఫారాల పంపిణీ

by Y. Venkata Narasimha Reddy |
TDP MLC : టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీ ఫారాల పంపిణీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్(AP) లో జరుగుతున్న గుంటూరు-కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్(Alapati Rajendra Prasad), రాజశేఖర్ (Rajasekhar)కి టీడీపీ(TDP) పార్టీ బీఫారాలు అందచేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు కింజరపు అచ్చం నాయుడు, పొంగూరు నారాయణలు అభ్యర్థులకు బీ ఫారాలు అందించారు. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.

ఎన్నికల ప్రక్రయలో భాగంగా 10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉండగా.. ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన , 13 వరకు నామినేషన్ల ఉప సంహరణ, ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌, మార్చి 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారు.

తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మెదక్ నిజమాబాద్, ఆదిలాబాద్ కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, అదే స్థానం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం ఒకే తేదీలతో నోటిఫికేషన్ జారీ చేిసింది.



Next Story

Most Viewed