విపత్తు సాయం ఏపీకే ఎక్కువ.. ఎంతంటే..

by Anil Sikha |
విపత్తు సాయం ఏపీకే ఎక్కువ.. ఎంతంటే..
X

దిశ, డైనమిక్​ బ్యూరో : ఏపీకి కేంద్ర ప్రభుత్వం భారీగా వరద సాయం (disaster realeaf) ప్రకటించింది. విపత్తు, వరద సాయం కింద 5 రాష్ట్రాలకు కేంద్రం రూ. 1554.99 కోట్ల నిధులు కేటాయిచింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ (AP) ​కి రూ. 608.08 కోట్లు విడుదల చేసింది. ఏపీతోపాటు తెలంగాణ, నాగాలాండ్, ఒడిశా, త్రిపుర రాష్ట్రాలకు నిధులు అందించింది. తెలంగాణకు రూ. 231. 75 కోట్లు, త్రిపురకు రూ.288.93 కోట్లు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, నాగాలాండ్ కు రూ.170.99 కోట్లు మంజూరు చేసినట్లు హోంమంత్రి అమిత్​షా (Amit sha) తన ట్విట్టర్​ఖాతాలో వెల్లడించారు. అన్ని రాష్ట్రాలలోకి ఏపీకే ఎక్కువ సాయం ప్రకటించడం విశేషం.

Next Story

Most Viewed