- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎపిక్ కార్డు లేకున్నా.. ఓటు హక్కును వినియోగించుకోవచ్చని మీకు తెలుసా..?
దిశ, తూర్పు గోదావరి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓటు వినియోగించుకోవడంపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా ఈ రోజు (బుధవారం) ఓ ప్రకటనను విడుదల చేశారు.ఓటు వినియోగించుకోవడంపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా ఈ రోజు (బుధవారం) ఓ ప్రకటనను విడుదల చేశారు.ఆ ప్రకటనలో ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) కి ప్రత్యామ్నాయంగా 12 రకాల ఇతర గుర్తింపు కార్డులను చూపించి తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
2024 లో రానున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, అలానే లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎపిక్ కార్డులు(ఓటరు గుర్తింపు కార్డులు) ఉన్నవారు ఆ కార్డులను పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చి తమ ఓటు వినియోగించుకోవాలని సూచించారు. ఎపిక్ కార్డులు తీసుకు రాలేని పక్షంలో ఎన్నికల జాబితా లో పేర్లు నమోదైన ఓటర్లు 12 రకాల ఇతర గుర్తింపు కార్డులలో ఏదో ఒక కార్డు తీసుకువచ్చి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
12 రకాల ఇతర గుర్తింపు కార్డులు వివరాలు చూస్తే.. ఆధార్ కార్డు, ఎంఎన్ఆర్ ఈ జిఏ జాబు కార్డు, బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసులు జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్ పుస్తకాలు(పాస్ బుక్), కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఎన్ పి ఆర్ కింద ఆర్.జి ఇ జారీ చేసిన స్మార్ట్ కార్డు, ఇండియన్ పాస్ పోర్టు, ఫోటోతో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేయబడిన అధికారిక గుర్తింపు కార్డులు, సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన దివ్యాంగుల గుర్తింపు కార్డులను చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని తెలిపారు.
ఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్ కార్డు) కార్డులో స్పెల్లింగ్ తప్పులు ఉన్నా ఆ ఓటరు నిజమైన ఓటరేనని నిర్ధారించుకున్న తర్వాత ఓటు వేయడానికి అనుమతి ఇస్తారన్నారు. ఓటు వేసే పోలింగ్ స్టేషన్ ఎన్నికల జాబితాలో తమ ఓటు కలిగిన ఓటర్లు.. మరొక అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి జారీ చేసిన ఎపిక్ కార్డు ద్వారా కూడా ఓటు వేయడానికి అనుమతి ఇస్తారని తెలిపారు.
ఒకవేళ ఓటరు గుర్తింపు కార్డులో ఫోటో తప్పుగా ఉంటే మాత్రం ఇతర 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపి ఓటు వేయొచ్చన్నారు. ఓటర్ల జాబితాలో నమోదైన ఓవర్సీస్ ఓటర్లు ఒరిజినల్ పాస్ ఫోటోని గుర్తింపు గా చూపించి మాత్రమే ఓటు వేయొచ్చన్నారు. ఇతర గుర్తింపు కార్డులు అనుమతించబడవని పేర్కొన్నారు.