శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు

by Jakkula Mamatha |   ( Updated:2025-03-15 17:53:24.0  )
శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్.. మోసపోయిన భక్తులు
X

దిశ,వెబ్‌డెస్క్: శ్రీశైలం(Srisailam) మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి నిత్యం వందల మంది భక్తులు(Devotees) వస్తుంటారు. ఈ క్రమంలో భక్తి శ్రద్ధలతో స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీశైలానికి వచ్చే భక్తులు వసతి కోసం శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ ఉంటారనే విషయం తెలిసిందే. అయితే శ్రీశైలం ఆలయంలో మరో తరహా మోసం వెలుగు చూసింది. కొంతమంది కేటుగాళ్లు శ్రీశైలం దేవస్థానం పేరుతో నకిలీ వెబ్‌సైట్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరుణంలో శ్రీశైలం ఆలయంలో వసతి కోసం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించే భక్తులను మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

అయితే.. కొంతమంది భక్తులు శ్రీశైలం ఆలయం(Temple)లో వసతి కోసం ఈ నకిలీ వెబ్‌సైట్‌ను ఆశ్రయించారు. ఈ క్రమంలో వారు కొంత డబ్బులు కూడా చెల్లించారు. దీంతో దుండగులు చేసిన పనికి హైదరాబాద్(Hyderabad), ముంబయి(Mumbai)కి చెందిన భక్తులు మోసపోయారు. డబ్బులు చెల్లించిన తర్వాత.. శ్రీశైలానికి వచ్చిన అనంతరం జరిగిన మోసాన్ని భక్తులు గుర్తించారు. ఈ విషయన్ని శ్రీశైలం దేవస్థానం దృష్టికి తీసుకెళ్లడంతో నకిలీ వెబ్‌సైట్ వ్యవహారం గుట్టురట్టైంది. అయితే గతంలోనూ ఇలాంటి మోసాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. దేవస్థానం అధికారులు ఈ మోసాలపై దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు.

READ MORE ...

Birbhum: పశ్చిమబెంగాల్ లో హోలీ వేడుకల్లో ఘర్షణ.. ఈనెల 17 వరకు ఇంటర్నెట్ నిలిపివేత


Advertisement
Next Story