AP News:రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యం-పరిటాల శ్రీరామ్

by Jakkula Mamatha |   ( Updated:2024-04-24 14:49:18.0  )
AP News:రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యం-పరిటాల శ్రీరామ్
X

దిశ,బత్తలపల్లి: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. బుధవారం బత్తలపల్లి మండలం సంగాల పంచాయతీ సంగాల తాండ గ్రామానికి చెందిన 20 కుటుంబాలు పరిటాల శ్రీరామ్ సమక్షంలో బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. టీడీపీలో చేరిన వారిలో గోగుల నారాయణ స్వామి, గోగుల శివయ్య, మంజుల పుల్లయ్య, షేక్ అల్లావుద్దీన్, మంజుల నరసింహులు, మంజుల లక్ష్మీనారాయణ తో పాటు మరికొందరు టీడీపీలో చేరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ గోనుగుంట్ల నారాయణరెడ్డి, గోనుగుంట్ల అమర్నాథ్ చౌదరి, క్లస్టర్ సురేంద్ర నాయుడు,వెంకట్రాముడు, లక్ష్మీనారాయణ, వెంకటేష్, శంకర్, నవీన్, నరసింహుడు,బాబు, వెంకటరాముడు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

Read More...

వేముల సతీశ్‌పై కేసు.. నారా లోకేశ్ సంచలన నిర్ణయం


Advertisement
Next Story

Most Viewed