అసెంబ్లీకి.. రావాలి జగన్​..

by Anil Sikha |
అసెంబ్లీకి.. రావాలి జగన్​..
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ జగన్ అసెంబ్లీకి వచ్చి తన మనసులో ఉన్న మాట చెప్పాలని సూచించారు. ఎవరైనా శాసన సభ్యుడు అకారణంగా, సెలవు అడగకుండా 60 రోజులు సభకు రాకుంటే అనర్హత రేటు వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా, స్పీకర్​, సీఎం పదవులను ప్రజలు ఇస్తారని తెలిపారు. తనను కస్టోడియల్ టార్చర్ పెట్టిన కేసుపై పోరాటం ఆగదన స్పష్టం చేశారు. ఈ కేసులో సునీల్ కుమార్ పాత్ర స్పష్టమైనదన్నారు. దోషులకు శిక్ష పడుతుందనే నమ్మకం తనకు ఉందని రఘురామ ధీమా వ్యక్తంచేశారు.

Next Story