- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వారందరికీ పవన్ ఆహ్వానం.. ఈ రోజు నుంచే కార్యాచరణ ప్రారంభిద్దామంటూ పిలుపు

దిశ, వెబ్ డెస్క్: చిత్తడి నేలలు(wetlands) పరిరక్షించుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) అన్నారు. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం(World Wetlands Day)లో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకృతి(Nature)లో అత్యంత విలువైన పర్యావరణ వ్యవస్థలలో చిత్తడి నేలలు ప్రధానమైనవనపి తెలిపారు. పర్యావరణం(Environment)లో చిత్తడి భూముల ప్రాధాన్యాన్ని అందరం గుర్తించాలన్నారు. ఇవి సహజ నీటి శుద్ధి కేంద్రాలని, కార్బన్ నిల్వ కేంద్రాలని, వర్షపు నీటిని భూగర్భానికి చేరుస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడే అసాధారణమైన ప్రదేశాలని చెప్పారు. భూకంప ఉద్ధృతిని తగ్గించడంలో, వాతావరణ మార్పులను నియంత్రించడంలో, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో చిత్తడి నేలలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పవన్ పేర్కొన్నారు.
25 వేలకు పైగా చిత్తడి నేలలు
‘‘ఏపీ(Ap)లో 25 వేలకు పైగా చిత్తడి నేలలన్నాయి. వీటిలో కొల్లేరు సరస్సు(Kolleru Lake) ప్రాముఖమైంది. ఈ ప్రదేశం రామ్‌సర్ సైట్‌గా గుర్తింపు పొందింది. భారతదేశం(India)లోని అతి పెద్ద తీపి నీటి సరస్సులలో కొల్లేరు ఒకటి. దేశంలో రెండవ అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు పులికాట్. సముద్ర జీవజాలానికి ఉప్పుటేరు కీలకమైంది. చిత్తడి భూములు పక్షుల సంరక్షణకు, మత్స్య సంపదకు మాత్రమే కాదు... వ్యవసాయానికి ఉపయోగపడుతున్నాయి. ఇలా వేల మంది ప్రజలకు ఈ నేలలు జీవనాధారం అందిస్తున్నాయి. అంతటి విలువైన వనరులను రక్షించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోది. ఆక్రమణలను నివారించేందుకు, భౌగోళిక పరిమితులను నిర్థారించేందుకు కృషి చేస్తున్నాం. అయితే పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, మన అందరి బాధ్యత. పర్యావరానాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలి.’’ అని పవన్ కల్యాణ్ సూచించారు.
అలా చేస్తేనే ప్రకృతిని కాపాడగలం
స్వప్రయోజనాలను తగ్గించుకోవడం ద్వారా మాత్రమే ప్రకృతిని కాపాడగలమని పవన్ తెలిపారు. ప్రతి చిన్న ప్రయత్నం సమష్టిగా మొదలైతేనే అది పెద్ద మార్పుకు దారి తీస్తుందని ఆయన తెలిపారు. అవగాహన, ప్రామాణికమైన పద్ధతులు, ప్రకృతిపట్ల గౌరవం కలిగినప్పుడు మాత్రమే ఈ విలువైన పర్యావరణ వ్యవస్థలను రాబోయే తరాలకు అందించగలమన్నారు. భవిష్యత్తు తరాల కోసం ఈ రోజు నుంచే పర్యావరణాన్ని కాపాడే కార్యాచరణను ప్రారంభిద్దామంటూ పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు.