- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
‘డిప్యూటీ సీఎం పవన్ గారూ.. ఎందుకు స్పందించట్లేదు?’.. గ్రూప్-2 అభ్యర్థి కన్నీళ్లు!

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష (Group-2 Exam Mains)ను వాయిదా వేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు (Candidates) ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రోస్టర్‌లో లోపాలు సరి చేయాలంటూ నిన్న(శుక్రవారం) హైదరాబాద్‌లో గ్రూప్–2 అభ్యర్థులు నిరసనలు చేపట్టారు. అదేవిధంగా గ్రూప్-2 మెయిన్స్ (Group-2 Mains) పరీక్షను కూడా వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
కానీ.. రేపు(ఆదివారం) గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. అనేక వివాదాల నడుమ 905 గ్రూప్-2 పోస్టులకు మెయిన్స్ పరీక్ష రేపు(ఆదివారం) జరగనుంది. రోస్టర్‌లో లోపాలు సరిచేయాలని పలువురు అభ్యర్థులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం కూడా రోస్టర్ విధానంలో తప్పులను సరిచేసే వరకు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు హైదరాబాద్(Hyderabad)లో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సమస్య పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh), ఏపీపీఎస్సీ చైర్మన్(APPSC Chairman) ఎందుకు స్పందించట్లేదని ఓ యువతి కన్నీళ్లు పెట్టుకున్నారు. గత ఏడాది(2024)లో జనసేనకు ఓటేశానని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడికెళ్లారో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవితాలను నాశనం చేయవద్దని వేడుకున్నారు.