అఘోరీపై దళిత సంఘాలు మండిపాటు.. పోలీసులకు ఫిర్యాదు

by srinivas |   ( Updated:2025-04-19 10:39:30.0  )
అఘోరీపై దళిత సంఘాలు మండిపాటు.. పోలీసులకు ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో అఘోరీ(Aghori) వ్యవహారం సంచలనంగా మారింది. ఆ మధ్య ఆలయాల బాట పట్టి హల్ చల్ చేసింది. రీసెంట్‌గా ఓ యువతిని పెళ్లి చేసుకుని కలకలం రేపింది. అఘోరీకి పలుసార్లు పోలీసులు వార్నింగ్ ఇచ్చినా తీరు మారలేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ స్థానిక నేతలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నెల 14న తెలుగు రాష్ట్రాల్లో అంబేద్కర్ జయంతి ఘనంగా జరిగింది. రాజ్యాంగ రూపకర్తకు నేతలు, ప్రముఖులు, సినీ నటులు, ఉపాధ్యాయులు, చిన్నా పెద్దలు అందరూ ఘన నివాళులర్పించారు. రాజ్యాంగం కోసం ఆయన చేసిన సేవలకు కొనియాడారు.

అయితే అఘోరీ మాత్రం ఘోరంగా వ్యవహరించారు. అంబేద్కర్‌ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ రూపకర్త అని కూడా చూడకుండా అతి జుగుప్సాకరంగా మాట్లాడారు. దీంతో అఘోరీపై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌(Dr. BR Ambedkar)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అఘోరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌(Machilipatnam Police Station)లో ఫిర్యాదు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడమే కాకుండా.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అఘోరీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని.. దళితులకు క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed