Ap Inter Exams: అధికారులకు సీఎస్ ఆదేశాలు

by srinivas |
Ap Inter Exams: అధికారులకు సీఎస్ ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ పరీక్షలకు 10.67 లక్షల మంది హాజరుకానున్నారు. దీంతో ఇంటర్ బోర్డు అధికారులతో సీఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు. పేపర్ లీకేజీ, మాల్ ప్రాక్టీస్ వదంతులు లేకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని, సమీపంలోని జిరాక్స్ షాపులు మూయించి వేయాలని సూచించారు.

కాగా ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఈనెల 15 నుంచి ఏప్రిల్ 3 వరకు జరగనున్నాయి. ఇంటర్ సెకండియర్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. ఈ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి.



Next Story