పోలవరం పూర్తి కాకపోవడానికి కారణం ఆయనే.. సీపీఎం నేత సంచలన ఆరోపణలు

by srinivas |
పోలవరం పూర్తి కాకపోవడానికి కారణం ఆయనే.. సీపీఎం నేత సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కింది. దీంతో పాటు పనులు పూర్తి బాధ్యతలను రాష్ట్రప్రభుత్వానికి దక్కాయి. అయితే 2014లో ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును సగానికి పైగానే పూర్తి చేసింది. 2019లో ప్రభుత్వం మారింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత పనులు ఆశించిన మేర సాగలేదు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు అధికారాన్ని చేపట్టారు. దీంతో పోలవరం పనులు పూర్తి చేయడానికి 4 ఏళ్ల సమయం పడుతుందని చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు.

అయితే పోలవరం ప్రాజెక్టు అసంపూర్తిగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సీపీఎం నేత శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం పూర్తి కాకపోవడానికి ప్రధాని మోడీనే కారణమని చెప్పారు. పోలవరంపై విజయాడలో సీపీఎం ఆధ్వర్వంలో నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ నిర్వాసితులకు ఇప్పటికీ న్యాయం జరలేదన్నారు. కమిటీ ఏర్పాటుతోనే బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలని, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులన్ని ఇవ్వాలని సీపీఎం సీనియర్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.



Next Story