- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CPM: విద్యుత్ ట్రూఅప్ ఛార్జీలను తక్షణమే తగ్గించండి..
దిశ, డైనమిక్ బ్యూరో: విద్యుత్ చార్జీలను పెంచలేదని, ఒక వైపున నోటిఫికేషన్ జారీ చేస్తూ, మరోవైపు సర్దుబాటుచార్జీల పేరుతో దొడ్డిదారిన భారాలు వేయడం మోసపూరితమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ శ్రీనివాసరావు ఆరోపించారు. 2023 ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతి నెలా విద్యుత్ యూనిట్‌కు 40 పైసల చొప్పున అదనంగా సర్దుబాటు చార్జీలు వసూలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
గతేడాది ప్రభుత్వం రూ.1400 కోట్లు విద్యుత్ చార్జీలు పెంచి భారం మోపిందని, 2014-19 మధ్య వినియోగించుకున్న విద్యుత్‌కు ఇప్పుడు 36 నెలల పాటు యూనిట్‌కు 25 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారన్నారు. దీని వలన రూ.2,900 కోట్లు భారం పడుతుందని తెలిపారు. అంతేకాదు 2020- 21లో వినియోగించుకున్న విద్యుత్‌పై యూనిట్‌కు 65 పైసలు వరకు 2023 ఏప్రిల్ నుండి అదనంగా వసూళ్లకు ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు. దీని వల్ల ప్రజలపై రూ.3083 కోట్లు భారం పడుతుందన్నారు. ఇవి కాకుండా మళ్లీ స్మార్ట్ మీటర్లు పెట్టి ఆ వ్యయాన్ని నెలవారీగా ప్రజలపై వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. విద్యుత్ చార్జీలను పెంచబోమని, తగ్గిస్తామని మాట చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మాట తప్పి ఈ రీతిలో భారాలు మోపటం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రతినెల విద్యుత్ సర్దుబాటు చార్జీలు విధించి భారాలు వేసే ఆదేశాలను ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.