- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
CPI: త్వరలో పోలవరం నుంచి అమరావతికి పాదయాత్ర
by srinivas |

X
దిశ,డైనమిక్ బ్యూరో: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రతిపక్షాలు లేకుండా పార్లమెంట్ ప్రారంభోత్సవం ఎలా అవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ విమర్శించారు. ఇది ప్రపంచ దేశాల ముందు భారత రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఆయన ఆరోపించారు. ప్రధానిగా నరేంద్రమోడీ వచ్చాక అన్ని వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని ధ్వజమెత్తారు. సీబీఐకి మర్యాద ఎప్పుడో పోయిందని మండిపడ్డారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కర్నూలులో వారం రోజులు సీబీఐ అధికారులు ఏంచేశారని నిలదీశారు. రాష్ట్రం కోసమే అమిత్‍షాతో జగన్ చర్చిస్తే ప్రజలకు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసు కోసమే జగన్ అమిత్‍షాను కలిశాడని ఆరోపించారు. త్వరలో పోలవరం నుంచి అమరావతికి పాదయాత్ర చేపట్టబోతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ స్పష్టం చేశారు.
Next Story