ఆ నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం..టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

by Jakkula Mamatha |   ( Updated:2024-04-01 15:24:02.0  )
ఆ నియోజకవర్గ అభివృద్ధే నా లక్ష్యం..టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
X

దిశ,తిరుపతి రూరల్:నియోజకవర్గం అభివృద్ధే నా ధ్యాస, ఊపిరి అని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. సోమవారం మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని, బాబు ఘారిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా తిరుపతి రూరల్ మండలం, పైడిపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన టీడీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.పులివర్తి నాని ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను గురించి ప్రజలకు వివరించారు.వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదని,ప్రజలు కూడా ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మద్యపాన నిషేధం, ఉద్యోగులకు సీపీఎస్‌ అమలు, రైతులకు పోలవరం, అమరావతి రాజధాని నిర్మాణం చేయడం ఈ వైసీపీ ప్రభుత్వానికి చేత కావడం లేదని ధ్వజమెత్తారు.

ఈ రాష్ట్రం మరలా పూర్వ వైభవం సాదించాలంటే అనుభవశాలి, సంపద సృష్టించిన మేధావి అయిన చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఉందన్నారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో అరాచక పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారని పులివర్తి నాని ఆరోపించారు. ఎర్రచందనం, ఇసుక, మఠం భూములు, గంజాయి, అక్రమాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, తిరగబడితే కేసులు తప్ప ఎమ్మెల్యే చేసిన ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదని అన్నారు. విచ్చలవిడిగా తుడా నిధులు దుర్వినియోగం చేసి ప్రజా సంపదను దో చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవినీతి చిట్టాను ఆధారాలతో పాటు ప్రజల ముందు ఉంచుతామన్నారు. ప్రతి పైసాకు ఎమ్మెల్యే సమాధానం చెప్పాల్సిన సమయం త్వరలో వస్తుందన్నారు. నియోజకవర్గాన్ని గాడిలో పెట్టేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని పులివర్తి నాని మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story