- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Karnataka Election Results: కర్ణాటక కోసం పార్థించాం... బీజేపీని ఓడించాం: కేఏపాల్
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పొత్తులతో పని లేకుండా ఒంటరిగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫేస్ బుక్ ద్వారా స్పందించారు. కర్ణాటకలో బీజేపీ ఓటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని చిత్తుగా ఓడించి కర్ణాటకను రక్షించామన్నారు. గత రెండేళ్లుగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాశాంతి పార్టీ మద్దతిస్తోందని చెప్పారు. బీజేపీ, జేడీఎస్ పార్టీని ఓడించాలని ప్రార్థించామని.. అందుకోసం చివర వరకూ ప్రయత్నించామన్నారు. కర్ణాటకలో బీజేపీ మద్దతుతో జేడీఎస్ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందన్నారు. మరోవైపు జేడీఎస్ గెలుపు కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ కర్ణాటక ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు తనకు తెలసిందన్నారు.
తెలంగాణ రాజకీయాలపై కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక తెలంగాణ రాజకీయాలపైనా కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్‌గా ఉందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో మాత్రమే గెలిచిందని గుర్తు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్‌కు తాము ఏ విధంగానైతే మద్దతిచ్చామో.. తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి కాంగ్రెస్ అలా మద్దతిచ్చి గెలిపించాలని కోరారు. బీజేపీని, బీఆర్ఎస్ పార్టీల ఓటమికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పని చేయాలని కేఏపాల్ సూచించారు.
విజయం దిశగా కాంగ్రెస్
కాగా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ - 135, బీజేపీ -65, జేడీఎస్-20, ఇతరులు నాలుగు స్థానాల్లో ముందజలో ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులు చాలా చోట్ల గెలిచారు. అత్యధిక స్థానాల్లో గెలిచి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టబోతోంది. ఫలితాలు ముగిసే వరకు కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయ కేతనం ఎగురవేయనుంది.
ఇవి కూడా చదవండి: