Ap Politics:సీఎం జగన్ పాలనంతా అంకెల గారడీలు,అబద్ధాలే: మాజీ మంత్రి

by Jakkula Mamatha |
Ap Politics:సీఎం జగన్ పాలనంతా అంకెల గారడీలు,అబద్ధాలే: మాజీ మంత్రి
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అసెంబ్లీ,లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో అన్ని పార్టీల నేతలు సభలు,సమావేశాలు నిర్వహిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. దీంతో పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఈ క్రమంలోనే పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. సీఎం జగన్ పాలన గురించి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో జరిగిన రైతు ఆత్మహత్యలు అన్ని జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే అని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ప్రతి రైతు కుటుంబం పై రూ.2.45 లక్షల అప్పు ఉంది. తుఫాన్లు, వరదలు, కరవుతో నష్టపోయిన వారిలో కొందరికే పరిహారం అందింది. అంకెల గారడీలు, అబద్ధాలతో జగన్ బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. వైసీపీ పాలనతో రైతుల జీవితాలు గాలిలో దీపంలా మారాయి అని విమర్శించారు.

Next Story

Most Viewed