- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్ అలర్ట్.. ఆ ఎమ్మెల్యేతో డైరెక్ట్‌గా చర్చలు
దిశ, వెబ్ డెస్: సీఎం జగన్ మోహన్ రెడ్డి కొన్ని నియోజకవర్గాలకు కొత్త ఇంచార్జులను నియమించారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో వారే పోటీ చేస్తారనే సంకేతం కూడా ఇచ్చారు. అయితే కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు నిరాకరించారు. దీంతో కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. అసంతృప్తులు చేయి జారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇందులో భాగంగా వారిని బుజ్జగించేందుకు ఆయనే రంగంలోకి దిగారు. ఒక్కొకరిని పిలిచి మాట్లాడుతున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా న్యాయం చేస్తామనే హామీ ఇస్తున్నారట. తాజాగా తన క్యాంపు కార్యాలయానికి సంతనూతనపాడు ఎమ్మల్యే సుధాకర్ బాబును పిలిచారు. ప్రస్తుతం ఆయనతో చర్చలు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వనందుకు అసంతృప్తి చెందొద్దని సూచించారట. అధికారంలోకి వస్తే తమకు కచ్చితంగా న్యాయం చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సంతనూతలపాడు నియోజకవర్గంలో మేరుగ నాగార్జునకు సహరించాలని కోరారట. ప్రస్తుతం సుధాకర్ బాబుతో సీఎం జగన్ భేటీ కొనసాగుతోంది. ఈ భేటీపై కాసేపట్లో సుధాకర్ బాబు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
కాగా సంతనూతలపాడు వైసీపీ ఇంచార్జిని మేరుగ నాగార్జునను సీఎం జగన్ మోహన్ రెడ్డి నియమించారు. దీంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సుధాకర్ బాబు అంతృప్తి వ్యక్తం చేశారు. అటు కార్యకర్తలు సైతం మేరగ నాగార్జునకు సహకరించమని మీడియా ముఖంగా తేల్చి చెప్పారు. అంతేకాదు మేరుగ నాగార్జున పోటీ చేస్తే తాము ఓడిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానం అలర్ట్ అయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబుతో చర్చలు జరుపుతోంది. వచ్చే ఎన్నికల్లో మేరుగ నాగార్జున గెలుపునకు కృషి చేయాలని సూచిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.