- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్టే పొడిగింపు.. సీఎం జగన్‌కు ఎదురుదెబ్బ
దిశ, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టులో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. విశాఖలోని రామానాయుడు స్టూడియో భూములు అమ్మేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. రామానాయుడు స్టూడియో భూముల అమ్మకాలపై గతంలో ఇచ్చిన స్టేను కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.
కాగా విశాఖలో రామానాయుడు స్టూడియోకు 2003లో అప్పటి ప్రభుత్వం 35 ఎకరాల భూములను సినీ అవసరాల కోసం కేటాయించింది. అయితే సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ భూములను అమ్మేందుకు యత్నించారు. ఆ భూములను లే ఔట్‌లుగా మార్చి అమ్మకాలకు సిద్ధం చేశారు. దీంతో ఆ భూముల అమ్మకాలపై స్టే ఇవ్వాలని ఎమ్మల్యే వెలగపూడి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇరువర్గాల విన్న ధర్మాసనం.. భూముల అమ్మకాలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు మార్చి 11లోపు సమాధానం చెప్పాలని ప్రభుత్వం, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సమాధానమిచ్చేందుకు సమయం కావాలని పిటిషనర్ కోరారు. దీంతో కోర్టు అంగీకరించింది. ఆరు వారాలు సమయం ఇచ్చింది.