YS Jagan Mohan Reddy: ఎన్నికల వేళ సీఎం జగన్ సంచలన నిర్ణయం

by Satheesh |   ( Updated:2023-12-11 15:02:21.0  )
Ys Jagan
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న వేళ అధికార వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. 11 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లను మార్చింది. ఇన్‌ఛార్జ్‌ల మార్పునకు సంబంధించిన వివరాలను ఆ పార్టీ కీలక నేత, మంత్రి బొత్స సత్యనారాయణ తాడేపల్లిలో ఇవాళ మీడియాకు వెల్లడించారు. ప్రత్తిపాడుకు బాలసాని కిషోర్, తాటికొండకు సుచరిత, సంతనూతలపాడుకు మేరుగ నాగార్జున, కొండెపికి ఆదిమూలపు సురేష్, వేమూరు స్థానానికి అశోక్ బాబు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మంత్రి విడదల రజినీ, అద్దంకి పాణెం హనిమిరెడ్డి, మంగళగిరికి గంజి చిరంజీవి, చిలకలూరిపేటకు రాజేష్ నాయుడు, గాజువాక స్థానానికి రామచందర్ రావు, రేపల్లేకు గణేష్‌లను నియమించినట్లు ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed