AP Politics:నేడు ఎక్సైజ్ శాఖ పై శ్వేతపత్రం విడుదల..సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
AP Politics:నేడు ఎక్సైజ్ శాఖ పై శ్వేతపత్రం విడుదల..సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు (బుధవారం) అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మద్యపాన నిషేధం పై శ్వేతపత్రం విడుదల చేశారు. ఇప్పటికే పలు అంశాలపై శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కల్తీ మద్యం పై మాట్లాడుతూ గత వైసీపీ పాలన పై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం కల్తీ లిక్కర్‌ను అమ్మి ప్రజల జీవితాలతో చెలగాటమాడిందని మండిపడ్డారు. మద్యం డ్రగ్స్ వల్ల జరిగిన ఆత్మహత్యలు 2018తో పోలిస్తే 2022కు 100 శాతం పెరిగాయన్నారు. మహిళలపై మద్యం సంబంధిత దాడులు 76.40 శాతం పెరిగాయని చెప్పారు. 75 శాతం మద్యం రేట్లను పెంచి ప్రజల సొమ్మును దండుకుందని విమర్శలు గుప్పించారు. లిక్కర్ ధరలను ఇష్టారీతిన పెంచుకుంటూ వెళ్తే తాగేవారు తగ్గుతారని కుంటిసాకులు చెప్పి ప్రజలను మోసం చేశారని వాపోయారు. ఫైవ్ స్టార్ హోటళ్లకే లిక్కర్‌ను పరిమితం చేస్తామని చెప్పిన వైసీపీకి.. మద్యపాన నిషేధం పై కమిట్‌మెంట్ లేదని సీఎం చంద్రబాబు విమర్శల వర్షం కురిపించారు.


AP News:ఉచిత గ్యాస్ సిలిండర్‌ పథకంపై మంత్రి కీలక ప్రకటన..!

Advertisement

Next Story