- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Assembly:‘గత ప్రభుత్వంలో అనేక అక్రమ కేసులు పెట్టారు’..సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..2019-2024 మధ్య కాలంలో ప్రభుత్వమే హింసను ప్రేరేపించిందని అన్నారు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే ఏంటో గత ప్రభుత్వం చూపించిందని విమర్శించారు. ‘వైసీపీ కక్షపూరిత చర్యలకు పోలీసులు ఆయుధాలుగా మారారు. తమ మాట వినని పోలీసులను వెకెన్సీ రిజర్వ్‌కు గత ప్రభుత్వం పంపించింది. ఐదేళ్లూ వీఆర్‌లో పోలీసు అధికారులు ఉన్నారు’ అని సీఎం వెల్లడించారు. ‘నా మీద ఒక్క కేసు కూడా లేదు. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాపై 17, పవన్ కళ్యాణ్ మీద 7 కేసులు పెట్టారు’ అని తెలిపారు.
గత వైసీపీ హయాంలో పవన్ రోడ్డు మీద పడుకుని నిరసన తెలియజేసే పరిస్థితి కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బోండా ఉమ, బుద్దా వెంకన్నను అడ్డుకున్నారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకు రాజమండ్రిలో వంతెన కూడా మూసేశారు. స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేశారు. ధూళిపాళ నరేంద్ర, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు. ఆదిరెడ్డి అప్పారావు, పత్తిపాటి పుల్లారావు వంటి కుటుంబాలను ఇబ్బంది పెట్టారు. స్పీకర్ అయ్యన్న పై కేసులు పెట్టారు. తప్పుడు కేసులు పెట్టి కోడెలను అవమానించారు. ఆ అవమానంతోనే కోడెల ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునేలా చేశారని మండిపడ్డారు. అంతేకాదు వైసీపీ హయాంలో మీడియా పై దాడి జరిగింది. మీడియా మేనెజ్‌మెంట్‌లపై సీఐడీ కేసులు పెట్టారు అని సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా పేర్కొన్నారు.