Chandrababu: నేను తప్పు చేయను.. చేసిన వారిని వదలను

by Gantepaka Srikanth |
Chandrababu: నేను తప్పు చేయను.. చేసిన వారిని వదలను
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో శాంతి భద్రతలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 14,700 సీసీ కెమెరాలను మానిటర్ చేసేవాళ్లు లేరని అన్నారు. ఆ సీసీ కెమెరాలు పోలీస్ వ్యవస్థకు అనుసంధానించబడలేదు అని తెలిపారు. క్రైమ్ జరిగిన వెంటనే పట్టుకునే మెకానిజం ఉండాలి అని అన్నారు. ఫిర్యాదుల్లో ఎక్కువ భూములకు సంబంధించిన సమస్యలే ఉన్నాయని వెల్లడించారు. గతంలో ఏపీలో ల్యాండ్ రికార్డులు పకడ్బందీగా ఉండేవని గుర్తుచేశారు. విశాఖ, తిరుపతి, ఒంగోలు, నెల్లూరులో 22ఏ ఘటనలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.

ఇక నుంచి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీపడేది లేదని తెలిపారు. నేను తప్పు చేయను.. చేసిన వారిని వదలను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలో కొత్త లిక్కర్ పాలసీ తీసుకొస్తామని అన్నారు. దేశంలోనే అత్యుత్తమ పాలసీని తీసుకొస్తామని తెలిపారు. గత ప్రభుత్వం పోర్టుల నిర్మాణాన్ని ఈపీసీ పద్దతుల్లో చేపట్టిందని తెలిపారు. పోర్టులు నిర్మించే కంపెనీలకు ప్రభుత్వం గ్యారెంటీలు ఎక్కడ ఇవ్వగలదని ప్రశ్నించారు. కానీ పోర్టుల్లో జరుగుతున్న నిర్మాణ పనులను ఆపలేమన్నారు. కాంట్రాక్టర్లను తప్పుచేసి పనులు ఆపేయడం ఈ ప్రభుత్వ విధానం కాదని సీఎం స్పష్టం చేశారు. ఏపీలో ఈవీ వెహికల్స్‌ను ప్రొత్సహించాలని సూచించారు. ఈవీ వాహనాలకు ఛార్జింగ్ కోసం పెద్ద ఎత్తున ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed