గుడ్ న్యూస్.. రైతు భరోసా పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

by Jakkula Mamatha |
గుడ్ న్యూస్.. రైతు భరోసా పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అభివృద్ధే(Development) లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేడు(శనివారం) అన్నమయ్య జిల్లా సంబేపల్లి(Sambepalli)లో సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) పర్యటించారు.

ఈ తరుణంలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌(NTR Bharosa Pension) డోర్‌ టూ డోర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. మోటుకట్ల(Motukatla)లో వృద్ధురాలి ఇంటికి వెళ్లి సీఎం చంద్రబాబు పింఛన్ అందించారు. ఈ సందర్భంగా రాయచోటి సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని రాయచోటి సభలో సీఎం చంద్రబాబు వెల్లడించారు.

పెన్షన్లు(AP Pensions) పెంచి పేదల జీవితాల్లో వెలుగులు నింపామని తెలిపారు. కూటమి ప్రభుత్వం(AP Government) అధికారంలోకి వచ్చాకా ఆడబిడ్డల కళ్ళలో సంతోషం వచ్చిందని అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆడబిడ్డలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు(Gas Cylinder) ఇస్తున్నామన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి రైతు భరోసా(Rythu Bharosa) కింద రూ.20వేలు మే నెలలో(May Month) అందిస్తామని సీఎం చంద్రబాబు(CM Chandrababu) హామీ ఇచ్చారు. అలాగే ‘తల్లికి వందనం’ పథకం కూడా ఈ ఏడాదే ప్రారంభిస్తామని తెలిపారు. ఈ తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ప్రకటించారు.


Next Story

Most Viewed