‘ఎన్ని భాషలైన నేర్చుకుంటాం’.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
‘ఎన్ని భాషలైన నేర్చుకుంటాం’.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Meetings) కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల భాష(language) పై తీవ్ర చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) అసెంబ్లీలో భాష పై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భాష అనేది కమ్యూనికేషన్ కోసమే అని, దాంతో విజ్ఞానం రాదని సీఎం చంద్రబాబు అన్నారు.

మాతృభాష(mother tongue)తోనే విజ్ఞానం వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. భాషపై లేనిపోని రాజకీయాలు చేయం అన్నారు. భాష అనేది ద్వేషించడానికి కాదని తెలిపారు. ఇక బతుకుదెరువుకు ఎన్ని భాషలైనా నేర్చుకుంటాం. కానీ మాతృభాషను మరిచిపోకూడదు అని సీఎం చంద్రబాబు తెలిపారు. మరోవైపు ధ్వంసమైన రాష్ట్రాన్ని ట్రాక్‌లో పెట్టామన్నారు. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. రాయలసీమను రతనాలసీమ గా మార్చడం ఖాయమని సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా వివరించారు.

Next Story

Most Viewed