- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Assembly:నేడు మరో అంశం పై శ్వేతపత్రం విడుదల..సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కాగా నేటితో ఈ సమావేశాలు ముగియనున్నాయి. అయితే ఈ రోజు(శుక్రవారం) అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఎలా అస్తవ్యస్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిధులను ఎలా దారి మళ్లించారు. 2019-24 మధ్య రూ.1,41,588 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించారు. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులపై నేడు చర్చించనున్నారు.
అంతకంటే ముందు టిడ్కో గృహాల అంశంపై సభలో స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. నీటి పారుదల శాఖ, పోలవరం బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వివిధ ప్రాజెక్టులకు చెందిన రూ.19,324 కోట్ల మేర బకాయిలను గుర్తించారు. ఆర్థిక శాఖ నుంచి రూ.19,549 కోట్ల బిల్లుల పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో రూ.14 వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు పేర్కొంది. మున్సిపల్ శాఖలో రూ.7,700 కోట్లకు పైగా బకాయిలను గుర్తించినట్లు పేర్కొంది.