సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..లోక్‌సభలో టీడీపీ విప్‌గా బాలయోగి తనయుడు

by Jakkula Mamatha |   ( Updated:2024-06-23 11:14:50.0  )
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..లోక్‌సభలో టీడీపీ విప్‌గా బాలయోగి తనయుడు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. లోక్‌సభలో టీడీపీ విప్‌గా అమలాపురం ఎంపీ గంటి హరీశ్‌ మాథుర్‌ని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 3.42 లక్షల ఓట్ల మెజార్టీతో హరీష్ ఎంపీగా గెలుపొందారు. గతంలో హరీష్ తండ్రి బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. లోక్‌సభ స్పీకర్‌గా బాలయోగి సభను హుందాగా నడిపించి అగ్ర నాయకుల మెప్పు పొందారు. ఇప్పుడు ఆయన తనయుడు హరీశ్‌కి విప్ బాధ్యతలు అప్పగించడంతో తగిన ప్రాధాన్యం ఇచ్చినట్లయిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. సీఎం చంద్రబాబు నిర్ణయం పై పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed