విజయసాయిరెడ్డి రాజీనామా పై స్పందించిన సీఎం చంద్రబాబు.. సెన్సేషనల్ కామెంట్స్!

by Jakkula Mamatha |   ( Updated:2025-01-25 10:08:10.0  )
విజయసాయిరెడ్డి రాజీనామా పై స్పందించిన సీఎం చంద్రబాబు.. సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ(YSRCP)లో కీలక నేతగా కొనసాగుతున్న విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) రాజీనామా ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. ‘ఇకనుంచి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్న.. నా భవిష్యత్తు వ్యవసాయమే’ అంటూ విజయసాయిరెడ్డి శుక్రవారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అసలు వైసీపీలో ఏం జరుగుతుందన్న చర్చలు జోరందుకున్నాయి. ఎవరూ ఊహించని విధంగా రాజ్యసభకు రాజీనామా చేస్తున్నానని విజయసాయిరెడ్డి ప్రకటించడంతో శనివారం ఉదయాన్నే ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ నివాసానికి వెళ్లి తన రాజీనామా లేఖ సమర్పించారు.

ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి రాజీనామా పై తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) స్పందించారు. ఈ తరుణంలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రాజీనామా వైసీపీలో అంతర్గత వ్యవహారం అన్నారు. వైసీపీ పరిస్థితి ఎలా ఉందో ఆ పార్టీ నేతలకే తెలుస్తోంది. దానిని బట్టి వారు నిర్ణయం తీసుకుంటారు. నాయకుడిపై నమ్మకం ఉంటే నేతలు ఉంటారంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నమ్మకం లేకపోతే.. ఎవరి మార్గం వాళ్ళు చూసుకుంటారని అన్నారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి రాజీనామాను ఆమోదించారు. ఈ వ్యవహారం మొత్తం చకచకా జరిగిపోగా.. విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ నేతలు(TDP Leaders) ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.



Next Story

Most Viewed