- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
CM Chandrababu: నాలాంటి వాళ్లకు కూడా రక్షణ లేకుండా పోయింది.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: ఐదేళ్ల వైసీపీ (YCP) పాలనలో తన లాంటి వాళ్లకే రక్షణ లేకుండా పోయిందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. ఇవాళ ఆయన గుంటూరు జిల్లా (Guntur District) పొన్నెకల్లు (Ponnekallu)లో సభలో మాట్లాడుతూ.. రాజధాని అమరావతి (Amaravati)ని నేడు ప్రతిపక్షంలో నాయకులు ఎడారి, శ్మశానం అంటూ వర్ణించారని కామెంట్ చేశారు. రాజధానిని ధ్వంసం చేసి పైశాచిక ఆనంతం పొందారని ఫైర్ అయ్యారు. చరిత్రలో ఎప్పుడూ చూడని రాజకీయం 2019-2024 మధ్య చూశానని అన్నారు. తన లాంటి వాళ్లు కూడా బయటకు రాని పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. గతంలో మనుషులు పారిపోతుంటే కందకాలు తవ్వేవారని, హెలికాప్టర్ (Helicopter)లో వస్తే కింద చెట్లను నరికేశారని ఎద్దేవా చేశారు.
10 నెలల్లోనే ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. నేడు అందరం స్వేచ్ఛగా ఉన్నామంటూ అందుకు కారణం రాజ్యాంగాన్ని రాసి ఆ అంబేద్కరేనని తెలిపారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan)తో కలిసి రాష్ట్రాన్ని బాగు చేస్తున్నామని, చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా సంక్షేమం అందిస్తున్నామని కామెంట్ చేశారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే పరమావధిగా పాలనను కొనసాగిస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్యానికి దశ, దిశ కల్పించిన వ్యక్తి అంబేద్కర్ (Ambedkar) అని.. ఆయన ఏ ఒక్కరివారో కాదు.. అందరివాడని తెలిపారు. కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాడారని.. దళితుల కోసం యుద్ధం చేసిన యోధుడు అంటూ సీఎం చంద్రబాబు కొనియాడారు. చదువుకోవాలనే ఆశ ఉన్న ప్రతి ఒక్కరిని చదివిస్తామని అన్నారు. ఎస్సీ (SC) సంక్షేమానికి రూ.20,280 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ రైతుల కోసం రూ.1,300 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. దళితులకు టీడీపీ (TDP) ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఆర్థిక సంస్కరణతో అభివృద్ధి సాధ్యమైందని.. 2047 స్వర్ణాంధ్ర విజన్‌ను తయారు చేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.