CM Chandrababu: పింఛన్ల పంపిణీపై ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

by Shiva |   ( Updated:2024-07-21 06:27:46.0  )
CM Chandrababu: పింఛన్ల పంపిణీపై ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో సీఎం చంద్రబాబు పాలనాపరమైన వ్యవహారాలపై పూర్తిగా ఫోకస్ పెట్టారు.ఈ మేరకు ప్రతి నెలా ఒకటో తేదీనా పింఛన్ల పంపీణీ చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు తమ తమ నియోజకవర్గా్ల్లో పింఛన్ పంపిణీ కార్యక్రమాల్లో విధిగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పాలనా పరమైన పనులు ఉన్నా.. వాటన్నింటిని పక్కన పెట్టి పింఛన్ పంపిణీలో పాల్గొనాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసేందుకు ఇప్పటి నుంచి ప్రజలతో మమేకమే సేవలందించాలని సూచించారు. పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానం ఉండేలా పని చేయాలన్నారు. ఆయా జిల్లాల్లో ఉన్న పార్టీ కార్యాలయాలను నెలకు ఒక్కసారైనా.. విధిగా సందర్శించాలని సీఎం చంద్రబాబు తెలిపారు.

Advertisement

Next Story