Gudur: 30 నుంచి ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

by srinivas |
Gudur: 30 నుంచి ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
X

దిశ, గూడూరు ప్రతినిధి: ఈనెల 30వ తేదీ నుండి జూన్ 9వ తేదీ వరకు గూడూరులోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయని ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీకంటి రామ్మోహన్ రావు తెలిపారు. గూడూరు రాజావీధిలో వెలసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఈవో నవీన్ కుమార్ పాలకమండలి చైర్మన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు, సభ్యులు విడుదల చేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు మే నెల 30వ తేదీ నుండి జూన్ 9వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నామని భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించాలని కోరారు.

ఈవో నవీన్ కుమార్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామని, అదేవిధంగా ఈ పది రోజులు స్వామి వారికి నూతనంగా తయారు చేయించిన బంగారు కిరీటం అలంకరించడం జరుగుతుందన్నారు. భక్తులందరూ స్వామివారి దర్శించి తీర్ధప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ సమావేశంలో సభ్యులు అన్నం రఘురామయ్య సాదర్శి సుప్రజా కృష్ణయ్య వాచస్పతి, సురేంద్ర సాదర్తి ప్రసాద్ పాల్గొన్నారు...

Advertisement

Next Story