Tirumala: శ్రీవారిని దర్శించుకుని వెళ్తుండగా ప్రమాదం.. ఆరుగురికి గాయాలు

by srinivas |   ( Updated:2023-04-23 15:00:43.0  )
Tirumala: శ్రీవారిని దర్శించుకుని వెళ్తుండగా ప్రమాదం.. ఆరుగురికి గాయాలు
X

దిశ, తిరుమల: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లిన భక్తుల కారు తిరుమల ఘాట్‌ రోడ్డులో అదుపు తప్పింది. పక్కనే ఉన్న గోడను ఢీకొట్టి బోల్తా పడింది. తిరుమల మొదటి ఘాట్‌రోడ్డు 33వ మలుపు వద్ద ఈ ఘటన జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన ఇతర ప్రయాణికులు ఘాట్‌రోడ్డు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తిరుమల ట్రాఫిక్‌ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్శనమయ్యాక తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story