Tirupati: దొంగ ఓట్ల నమోదుపై టీడీపీ సీరియస్.. కలెక్టర్‌కు ఫిర్యాదు

by srinivas |
Tirupati: దొంగ ఓట్ల నమోదుపై టీడీపీ సీరియస్.. కలెక్టర్‌కు ఫిర్యాదు
X

దిశ, తిరుపతి: ఈ నెల 13న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సీపీ తిరుపతిలో 7 వేల దొంగ ఓట్లు నమోదు చేయించిందని కలెక్టర్ వెంకటరమణారెడ్డికి, అర్బన్ తహశీల్దార్ వెంకటరమణకి తెలుగుదేశం నాయకులు వినతిపత్రం అందజేశారు. దొంగ ఓట్లపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తిరుపతిలో స్థానిక సంస్థ ఎన్నికలు, పార్లమెంటు ఉపఎన్నికలు, తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికలప్పుడు అత్యధికంగా దొంగ ఓట్లు నమోదు చేసి అడ్డంగా గెలవడం జరిగిందన్నారు. అదే పందాలు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 7 వేలకు పైగా దొంగ ఓట్లను నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంటాక్ట్ ఉద్యోగులు తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే గెలుపు టీడీపీదేనని నిమ్మల రామానాయుడు ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed